ప్రభుత్వఖర్చులను అధ్యయనం చేసే ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్‌గా కాంగ్రెస్ నేత, ఎంపీ కేసీ వేణుగోపాల్‌ను నియమించినట్లు లోక్‌సభ సచివాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అంచనాలు, ప్రభుత్వ సంస్థల కమిటీలు సహా 4 కొత్త కమిటీలకు చైర్మన్లను నియమిస్తూ లోక్‌సభ స్పీకర్ బిర్లా నిర్ణయం తీసుకున్నారు.
ఆర్థికసంబంధాలకు సంబంధించి పీఏసీ, అంచనాలు, ప్రభుత్వ సంస్థల కమిటీలు కీలకం. ప్రభుత్వ చేస్తున్న ఖర్చులు, ప్రభుత్వరంగ సంస్థల సమర్థ నిర్వహణ వ్యవహారాలను ఈ కమిటీలు అధ్యయనం చేయడంతో పాటు నివేదికలు అందజేస్తాయి.
ఓబీసీల సంక్షేమ కమిటీ చైర్మన్ గా బీజేపీ నేత గణేశ్ సింగ్, ఎస్సీఎస్టీల సంక్షేమ కమిటీ చైర్మన్ గా బీజేపీ నేత ఫగాన్ సింగ్ కులస్తే బాధ్యతలు చేపట్టనున్నారు. అంచనా కమిటీకి బీజేపీ నేత సంజయ్ జైశ్వాల్, ప్రభుత్వ సంస్థల కమిటీకి చైర్మన్‌గా బీజేపీ నేత బైజయంతీ పాండాను నియమిస్తూ స్పీకర్ ఉత్తర్వులు జారీ చేశారు.