హిమాచల్‌ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు విరుచుకుపడ్డాయి. జనజీవనం స్థంభించిపోయింది. రోహ్డూ రామ్‌పూర్ జాతీయ రహదారి ధ్వంసమైంది. సిమ్లా జిల్లా రామ్‌పూర్ జాతీయ రహదారి 5 సహా, 132 రోడ్లు మూసివేశారు. చంబా, సిర్మౌర్ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. 1256 విద్యుత్ సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయి. గడచిన మూడు నెలలుగా వరదలు హిమాచల్‌ప్రదేశ్‌ను వెంటాడుతున్నాయి. తాజా ఆకస్మిక వరదలతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పంటలు దెబ్బతిన్నాయి.
సిమ్లా,మండి, కులూ, చంబా, కనౌర్, సిర్మౌర్ జిల్లాల్లో 132 రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. వేలాది ఎకరాల్లో యాపిల్ తోటలు ధ్వంసం అయ్యాయి. ఈ నెల 23 వరకు ఈ ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. పర్యాటకరంగానికి (shimla tourism effected )తీవ్ర విఘాతం ఏర్పడింది.