అమెరికాలో మరో ఘోరం వెలుగు చూసింది. ఓ బాలుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి మరణించాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
ఉత్తర కరోలినా విమానాశ్రయం సమీపంలో పోగాకు దుకాణం నిర్వహిస్తోన్న భారత సంతతి వ్యక్తి మైనాంక్ పటేల్‌ను ఓ బాలుడు సమీపం నుంచి కాల్చి చంపాడని అమెరికా పోలీసులు వెల్లడించారు. పొగాకు దుకాణంలో దొంగతనం చేసిన బాలుడు, తరవాత మైనాంక్పై విచక్షణా రహితంగా కాల్పుకు తెగబడ్డాడు. మైనాంక్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మైనాంక్ భార్య గర్భవతిగా ఉంది. వారికి ఐదేళ్ల కుమార్తె కూడా ఉంది. కాల్పుల ఘటనలు పెరిగిపోవడంపై స్థానికుల్లో ఆందోళన నెలకొంది.