ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, వైసీపీ కీలక నేత ఆళ్ళ నాని, ఆ పార్టీకి రాజీనామా చేశారు. గతంలో పార్టీ పదవులకు రాజీనామా చేశానని, ప్రస్తుతం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్ చేసినట్లు తెలిపారు.
వ్యక్తిగత కారణాలతో వైసీపీకి రాజీనామా చేసినట్లు వివరించారు. పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్ష పదవి, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవులకు ఇటీవల రాజీనామా చేశారు.
ఏలూరులో వైసీపీ కార్యాలయానికి సంబంధించి లీజు గడువు ముగియడంతో ఆ పార్టీ కార్యాలయం కోసం ఏర్పాటు చేసిన షెడ్లను కూల్చేశామన్నారు. స్థలం యజమాని అనుమతితో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిపామని, ఆ తర్వాత షెడ్లను తొలగించినట్లు చెప్పారు.వైసీపీ హయాంలో ఆళ్ళ నాని ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు.
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు రాణా అయ్యూబ్పై ఎఫ్ఐఆర్ నమోదు