ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్దమైంది. ఆగష్టు 19 నుంచి 31 వరకు 12 శాఖల్లో బదిలీలకు ఏపీ ప్రభుత్వం అనుమతిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. గనులు, రెవెన్యూ, పంచాయతీరాజ్, గ్రామ, వార్డు సచివాలయాలు, రవాణా, మహిళా సంక్షేమ శాఖ, వ్యవసాయ శాఖల్లో బదిలీలకు ప్రభుత్వం అనుమతించింది. ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసింది. సెప్టెంబరు 5 నుంచి అబ్కారీ శాఖలో బదిలీలు చేపట్టనున్నారు.
విద్య, వైద్యశాఖల్లో బదిలీలు చేపట్టలేదు. బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రజలతో నిత్యం సంబంధాలుండే శాఖల్లో మాత్రమే బదిలీలకు అనుమతించారు. నెలాఖరుకు బదిలీలను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.