ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో రేడియోధార్మిక పదార్ధాల కలకలం రేగింది. ప్రయాణీకుల బ్యాగేజీ తనిఖీ చేస్తోండగా అలారం మోగింది. వెంటనే సిబ్బంది అప్రమత్తమయ్యారు. జాతీయ విపత్తు నిర్వహణ దళాలకు ఫోన్ చేశారు. రంగంలోకి దిగిన బలగాలు అనువణువునా గాలిస్తున్నారు. ప్రయాణీకుల లగేజీల్లో రేడియోధార్మిక పదార్ధాలు తరలిస్తున్నారని అనుమానిస్తున్నారు.
ఇటీవల బిహార్లో రూ.850 కోట్ల విలువైన 50 గ్రాముల కాలిఫోర్నియాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల రేడియోధార్మిక పదార్థాలను స్మగ్లింగ్ చేస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరికలు చేస్తోన్న నేపథ్యంలో లక్నో విమానాశ్రయంలో రేడియోధార్మిక పదార్థం కలకలం రేపింది. ప్రయాణీకులకు దూరంగా పంపించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం అందాల్సి ఉంది.