రాజస్థాన్‌లోని చురూ జిల్లా పితిసార్ గ్రామంలో నివసించే రెహమాన్ ఖాన్‌ను ఆగస్టు 12న ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్ట్ చేసారు. తన భార్యకు ట్రిపుల్ తలాక్ ఇవ్వడం, అక్రమ ఇమిగ్రేషన్ ఆరోపణలపై అతను అరెస్ట్ అయ్యాడు. భద్రా పోలీస్ స్టేషన్లో అతని మొదటి భార్య ఫరీదా బానో, రెహమాన్ ఖాన్ మీద ఫిర్యాదు చేసింది.
ఫరీదా బానో తన భర్త తనను వరకట్నం కోసం వేధిస్తున్నాడనీ, ఫోన్లో ట్రిపుల్ తలాక్ చెప్పి విడిచిపెట్టేసాడనీ ఆరోపణలు చేసింది. తనను మోసం చేసి, మెవిష్ అనే పాకిస్తానీ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడని, ఆమెను భారత్‌లోకి అక్రమంగా తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాడనీ తన ఫిర్యాదులో ఆరోపించింది. ఫోన్‌కాల్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పి తననూ, తన పిల్లలనూ అంధకారంలోకి నెట్టేసాడని ఆవేదన వ్యక్తం చేసింది.
ఫరీదా బానో (29) రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లా భద్రా నివాసి. 2011లో పెళ్ళి సమయంలో ఇచ్చిన కట్నంతో పాటు, తన నగలు కూడా అమ్మి తన భర్త రెహమాన్ ఖాన్‌కు వ్యాపారానికి డబ్బులిచ్చానని చెప్పింది. ఆ డబ్బులతో అతను విదేశాల్లో వెంచర్లు ప్రారంభించాడనీ, ఆ తర్వాత తనను విడిచిపెట్టేసాడనీ ఆరోపించింది. ఖాన్ తన కొత్త పాకిస్తానీ భార్య మెవిష్ను భారత్‌లోకి అక్రమంగా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడనీ, అందువల్ల ప్రభుత్వం జోక్యం చేసుకోవాలనీ తన ఫిర్యాదులో పేర్కొంది.
మెవిష్ పాకిస్తాన్‌లోని లాహోర్‌కు చెందిన యువతి. ఆమెను రెహమాన్ ఖాన్ 2022లో వీడియోకాల్ ద్వారా రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఆమె 2024 జులై 25న భారత్‌లోకి 45 రోజుల పర్యాటక వీసా మీద వచ్చింది.
రెహమాన్ ఖాన్ కువైట్‌లో ఉండగా ఫరీదా బానో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతని మీద రాజస్థాన్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీచేసారు. అతను జైపూర్‌లో దిగినవెంటనే హనుమాన్‌గఢ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి దర్యాప్తు కోసం రెహమాన్ ఖాన్‌ను చురూ తరలించినట్లు హనుమాన్‌గఢ్ డిఎస్పి రణవీర్ సాయి వెల్లడించారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు