మేఘాలయ ఖాసీ కొండల్లోని రాణీకోర్ జిల్లాలో ఖాసీ స్టూడెంట్స్ యూనియన్ విద్యార్ధులు 24మంది బంగ్లాదేశీ చొరబాటుదారులను పట్టుకున్నారు. ఆగస్టు 14న జరిగిన ఆ సంఘటన వివరాలు ఆలస్యంగా వెలుగు చూసాయి. బంగ్లాదేశ్-భారత్ సరిహద్దుకు చేరువలోని మహేశ్‌ఖోలా ప్రాంతం నుంచి వారు భారతదేశంలోకి చొరబడ్డారు. బంగ్లాదేశీయులను పట్టుకున్న ఖాసీ స్టూడెంట్స్ యూనియన్ (కెఎస్‌యు) విద్యార్ధులు వారిని పోలీసులకు అపగించారు.
బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత రాజకీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దుల వద్ద భద్రతా చర్యలు పెంచాలని కెఎస్‌యు కోరింది. సరిహద్దుల వద్ద భద్రతను పటిష్టం చేయాలంటూ పోలీసులు, జిల్లా యంత్రాంగం, బిఎస్ఎఫ్ను కోరారు. అలాగే, మేఘాలయలో పనుల కోసం బైటివారిని చేర్చుకోవద్దంటూ కాంట్రాక్టర్లను హెచ్చరించింది. దేశంలోకి అనధికారికంగా చొరబడినవారు అటువంటి పనుల ద్వారా మెలమెల్లగా ఇక్కడే స్థిరపడిపోతుంటారు.
అంతకుముందు, త్రిపుర రాజధాని అగర్తలా రైల్వేస్టేషన్లో 16మంది బంగ్లాదేశీ చొరబాటుదార్లు భారతీయ అధికారులకు చిక్కారు. వారిలో ముగ్గురు మహిళలు కూడా ఉండడం గమనార్హం.