తుంగభద్ర ప్రాజెక్టులోని 19 నెంబరు గేటు కొట్టుకుపోయిన స్థానంలో కొత్తగేటు ఏర్పాటు ప్రక్రియ విజయవంతంగా సాగుతోంది. దాదాపు 70 టన్నుల బరువైన గేటును ఐదు భాగాలుగా విభజించి మొదటి భాగాన్ని విజయవంతంగా అమర్చారు. గేట్ల అమరిక నిపుణుడు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో 200 మంది కార్మికులు విజయవంతంగా గేటు ఎలిమెంట్ అమర్చారు. ఇవాళ సాయంత్రానికి మరో రెండు భాగాలు అమర్చి వరద నీటికి పూర్తిగా అడ్డుకట్ట వేయనున్నారు.
గడచిన వారం రోజులుగా తుంగభద్ర డ్యాం (Tungabadra dam stoplog) 19వ నెంబరు గేటు నుంచి 50 టీఎంసీల వరద జలాలు వృథాగా సముద్రం పాలయ్యాయి. గేట్ల స్థాయి వరకు నీటిని ఖాళీ చేయకుండానే స్టాప్ లాగ్ ఏర్పాటు పనులు ప్రారంభించారు. కర్ణాటకలోని జిందాల్ కంపెనీ, నారాయణ ఇంజనీరింగ్, హిందుస్థాన్ ఇంజనీరింగ్ కంపెనీల సహకారంతో గేటు భాగాలను తయారు చేసి ప్రాజెక్టు వద్దకు తరలించారు. రెండు రోజులుగా ఏర్పడిన అడ్డంకులను శుక్రవారం తొలగించారు. శుక్రవారం రాత్రి గేటులోని మొదటి ఎలిమెంటును విజయవంతంగా దించారు. మిగిలిన గేటు భాగాలను ఇవాళ అమర్చనున్నారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు