కలకత్తాలో జూనియర్ డాక్టర్ సామూహిక అత్యాచారం, హత్య ఘటనతో అట్టుడుకుతున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మరో ఘోరం బైటపడింది. స్వాతంత్ర్య దినోత్సవం నాడు తూర్పు బర్ద్వాన్ జిల్లా శక్తిగఢ్‌లో ఒక యువతి మృతదేహం లభించింది. ఆమె గొంతు కోసి ఉంది. ఆ ఘటన స్థానిక ప్రజల్లో భయాందోళనలు కలిగించింది. మృతురాలిని 22 ఏళ్ళ ప్రియాంక హస్డాగా గుర్తించారు. పోలీసులు అసహజ మరణంగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించారు.
మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం… ప్రియాంక బెంగళూరులో ఉద్యోగం చేస్తుండేది. సెలవుల్లో కుటుంబంతో గడపడం కోసం ఆగస్టు 12న ఇంటికి వచ్చింది. ఆగస్టు 14 బుధవారం రాత్రి ఫోన్ మాట్లాడుతూ ఇంట్లోనుంచి బైటకు వెళ్ళింది. అప్పటినుంచీ ఆమె కనబడకుండా పోయింది. చివరికి ఆమె శవం లభించింది, శవం గొంతు మీద కోసిన ఆనవాళ్ళు ఉన్నాయి.
పోలీసులు ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించారు. ఆఖరిసారి ఆమె ఎవరితో ఫోన్ మాట్లాడిందో కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. బాధిత కుటుంబం అది హత్యే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. బుధవారం రాత్రి ఫోన్‌కాల్ మాట్లాడాక ప్రియాంక బైటకు వెళ్ళిందనీ, ఆ తర్వాత కనబడలేదనీ చెప్పారు. తాము ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎటువంటి స్పందనా రాలేదని, చివరికి శవమై కనిపించిందనీ ఆవేదన చెందుతున్నారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు