కేంద్రప్రభుత్వం 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటించింది. ఉత్తమ చలనచిత్ర పురస్కారం మళయాళ సినిమా ‘ఆట్టం’కు దక్కింది. ఉత్తమ నటుడి అవార్డు కన్నడ చలనచిత్రం ‘కాంతార’ కథానాయకుడు రిషభ్ శెట్టి గెలుచుకున్నారు. ఉత్తమ నటి పురస్కారం నిత్యా మేనన్, మానసీ పరేఖ్ సంయుక్తంగా పంచుకున్నారు. మొత్తం అవార్డుల వివరాలు ఇలా ఉన్నాయి….
ఉత్తమ చిత్రం : ఆట్టం (మళయాళం)
ఉత్తమ మొదటి చిత్రం : ఫౌజా (హర్యాన్వీ)
ఉత్తమ ప్రజాదరణ చిత్రం : కాంతార (కన్నడ)
ఉత్తమ విలువల చిత్రం : కఛ్ ఎక్స్‌ప్రెస్ (గుజరాతీ)
ఉత్తమ గ్రాఫిక్స్ చిత్రం : బ్రహ్మాస్త్ర పార్ట్ 1: శివ (హిందీ)
ఉత్తమ దర్శకుడు : సూరజ్ బర్జాత్యా (ఊంచాయీ – హిందీ)
ఉత్తమ నటి : నిత్యా మేనన్ (తిరుచిట్రంబళం – తమిళం), మానసీ పరేఖ్ (కఛ్ ఎక్స్‌ప్రెస్ – గుజరాతీ)
ఉత్తమ నటుడు : రిషభ్ శెట్టి (కాంతార – కన్నడ)
ఉత్తమ సహాయ నటి : నీనా గుప్తా (ఊంచాయీ – హిందీ)
ఉత్తమ సహాయ నటుడు : పవన్‌రాజ్ మల్హోత్రా (ఫౌజా – హర్యాన్వీ)
ఉత్తమ బాలనటుడు : శ్రీపథ్ (మాలికాపురం – మళయాళం)
ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ : అన్బరివ్ (కెజిఎఫ్ 2 – కన్నడ)
ఉత్తమ కొరియోగ్రఫీ : జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ (తిరుచిత్రాంబళం – తమిళం)
ఉత్తమ గీత రచయిత : నౌషాద్ సాదర్ ఖాన్ (ఫౌజా: సలామీ – గుజరాతీ)
ఉత్తమ సంగీత దర్శకత్వం : ప్రీతమ్ (పాటలు), ఎఆర్ రెహమాన్ (నేపథ్య సంగీతం)
ఉత్తమ మేకప్ : సోమనాథ్ కుందు (అపరాజితో – బెంగాలీ)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ : నికీ జోషీ (కఛ్ ఎక్స్‌ప్రెస్ – గుజరాతీ)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : ఆనంద ఆద్య (అపరాజితో – బెంగాలీ)
ఉత్తమ ఎడిటింగ్ : మహేష్ భువనేంద్ (ఆట్టం – మళయాళం)
ఉత్తమ సౌండ్ డిజైన్ : ఆనంద్ కృష్ణమూర్తి (పొన్నియిన్ సెల్వన్ 1 – తమిళం)
ఉత్తమ స్క్రీన్‌ప్లే : ఆనంద్ ఏకర్షి (ఆట్టం), అర్పితా ముఖర్జీ అండ్ రాహుల్ చిట్టెల్ల (గుల్‌మొహర్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ : రవివర్మన్ (పొన్నియిన్ సెల్వన్ 1)
ఉత్తమ నేపథ్య గాయకుడు : అరిజిత్ సింగ్ (కేసరియా – బ్రహ్మాస్త్ర1)
ఉత్తమ నేపథ్య గాయని : బాంబే జయశ్రీ (చాయుమ్ వెయిల్ – సౌదీ వెల్లక్క సీసీ 225/2009)
ఉత్తమ తెలుగు చిత్రం : కార్తికేయ 2
ప్రత్యేక ప్రస్తావన – నటన : మనోజ్ బాజ్‌పేయీ (గుల్‌మొహర్ – హిందీ)
ప్రత్యేక ప్రస్తావన – సంగీత దర్శకత్వం : సంజయ్ సలీల్ చౌధురి (కధికన్ – మళయాళం)