దేశంలో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. ఆర్టికల్ 370 తొలగింపు తర్వాత తొలిసారిగా జమ్ముకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తుండగా, హర్యాణా శాసనసభకు కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఈసీ వెల్లడించింది.
జమ్ముకశ్మీర్ లో సెప్టెంబర్ 30లోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.
జమ్ము కశ్మీర్ శాసనసభలో 90 స్థానాలు ఉండగా మూడు విడతల్లో పోలింగ్ జరుగనుంది.సెప్టెంబర్ 18న 26 స్థానాలకు, 25న 26 స్థానాలకు , అక్టోబర్ ఒకటో తేదీన 40 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అక్టోబర్ నాలుగో తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. .
హర్యానాలో 90 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. అక్టోబర్ ఒకటో తేదీన ఎన్నికలు నిర్వహించి, నాలుగో తేదీన లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు.
మహారాష్ట్ర, ఝార్ఖండ్, శాసనసభలకు మరో ఐదు నెలల గడువు ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 3, హరియాణా శాసనసభకు నవంబర్ 26 వరకు గడువుంది. ఝార్ఖండ్‌కు మాత్రం వచ్చే ఏడాది జనవరి వరకు సమయం ఉంది.