వైసీపీ నేత దేవినేని అవినాష్ విదేశాలకు వెళ్లేందుకు చేసిన ప్రయత్నాన్ని హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సిబ్బంది అడ్డుకున్నారు. గురువారం రాత్రి దుబాయ్ వెళ్లేందుకు దేవినేని అవినాష్ శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు. చెక్ ఇన్లో అడ్డుకున్న సిబ్బంది వెంటనే మంగళగిరి పోలీసులకు ఫోన్ చేశారు. దేవినేనిపై లుకవుట్ నోటీసులు ఉన్నాయని విదేశాలకు అనుమతించ వద్దని చెప్పడంతో అతన్ని వెనక్కు పంపారు.
మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి ఘటనలో దేవినేని అవినాష్ ముద్దాయిగా ఉన్నారు. కేసు విచారణ జరగుతోంది. విదేశాలకు వెళ్లకుండా లుకవుట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం దేవినేని అవినాష్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.