పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొని భారత్ తిరిగి వచ్చిన క్రీడకారులతో ప్రధాని మోడీ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా గురువారంనాడు సరదాగా ముచ్చటించారు. 100 గ్రాముల బరువు అధికంగా ఉందనే కోణంలో పతకం కోల్పోయిన రెజ్లర్ వినేశ్ పోగట్‌పై ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. వినేశ్ వీరపుత్రిక అంటూ ప్రశంసించారు. ఒలింపిక్స్ క్రీడాకారులతో ప్రధాని మోదీ సరదాగా గడిపారు. వారి మారుపేర్లను అడిగి తెలుసుకున్నారు.
ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన రెజ్లర్ మనూభాకర్ ప్రత్యేకంగా తయారు చేసిన పిస్టల్‌ను ప్రధాని మోదీకి బహుకరించారు. పతకాలు సాధించలేని వారిని ప్రధాని మోదీ ఓదార్చారు. మీకు చాలా భవిష్యత్ ఉందని ప్రాక్టీస్ కొనసాగించాలని క్రీడాకారులను కోరారు. ఒలింపిక్స్ జరిగినన్ని రోజులు కనీసం ఫోన్ కూడా వాడలేదని క్రీడాకారులు ప్రధానికి వివరించారు.
వినేశ్ పోగట్ ప్రతిభను పలువురు క్రీడకారులు కొనియాడారు. పతకం చేజారినా ఒలింపిక్స్‌లో ఆమె చూపిన ప్రతిభను ప్రధాని మోదీ సైతం ప్రశంసించారు. కాస్‌లో కూడా వినేశ్ పోగట్ కేసు ఓడిపోవడం మరింత నిరాశను మిగిల్చిన విషయం తెలిసిందే.