కోల్‌కతా ఆర్జీ కార్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ హత్య, అత్యాచారాన్ని నిరసిస్తూ డాక్టర్లు రేపు దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. గత వారం ఆర్జీ కార్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌ను హత్య చేసి అత్యాచారానికి పాల్పడ్డ వ్యవహారం దేశ వ్యాప్త ఆందోళనకు దారితీసింది. ఆర్జీకార్ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందిస్తామని ఐఎంఏ తెలిపింది.
ఆర్జీ కార్ ఆసుపత్రి ఘటన వ్యవహారం బెంగాల్‌ను కుదిపేస్తోంది. ఇప్పటికే కేసును సీబీఐకి అప్పగించారు. ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం ట్రైనీ డాక్టర్‌పై సామూహిక అత్యాచారం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.
ఆర్జీ కార్ ఘటన తరవాత దేశ వ్యాప్తంగా డాక్టర్లు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్షణ లేదని, డాక్టర్లు పనిచేసే ప్రాంతాలను రక్షణ ప్రాంతాలుగా ప్రకటించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది.