భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో మైలురాయిని దాటింది. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఉపగ్రహాన్ని కాసేపటి కిందట తిరుపతి జిల్లా షార్ నుంచి విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. 175 కేజీల ఈవోఎస్ 08 ఉపగ్రహాన్ని 17 నిమిషాల్లో కక్ష్యలోకి పంపించారు. ఈ ఉపగ్రహం ప్రకృతి విపత్తులు, పర్యావరణం, అగ్రిపర్వతాలను పరిశీలిస్తుంది. అత్యంత నాణ్యమైన చిత్రాలను పంపుతుందని ఇస్రో ఛైర్మన్ తెలిపారు.
యూఆర్ రావు శాటిలైట్ కేంద్రం ఈ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసింది. లాంగ్ వేవ్ ఇన్ఫ్రా రెడ్, ఎలక్ట్రో ఆఫ్టికల్ ఇన్ఫ్రా రెడ్ చిత్రాలను ఈ ఉపగ్రహం తీయగలదు. ప్రకృతి విపత్తుల సమయంలో ఈ ఉపగ్రహ సమాచారం చాలా కీలకంగా ఉపయోగపడుతుందని ఇస్రో వెల్లడించింది.