బంగ్లాదేశ్‌లో హింసకు బలవుతున్న హిందువులను కాపాడాల్సిన బాధ్యత భారత్‌పై ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. బంగ్లాదేశ్ లో నివసిస్తున్న హిందువులను అకారణంగా టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో జెండాను ఎగురవేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి మోహన్ భగవత్ మాట్లాడారు.
ఇతరులకు సహాయం చేసే సంప్రదాయం భారతదేశంలో ఉందన్న మోహన్ భగవత్, గత కొన్నేళ్లుగా భారత్ ఎవరిపైనా దాడి చేయలేదన్నారు. కష్టాల్లో ఉన్న వారికి భారత్ సహాయం అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. బంగ్లాదేశ్‌లో నెలకొన్న అస్థిరత, అరాచకాలతో హిందువులు అవస్థలు పడుతున్నారని వారిని ఆదుకోవాలని కేంద్రప్రభుత్వాన్ని కోరారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు