శ్రీకాకుళం జిల్లాకు చెందిన మేజర్ మళ్ల రామ్‌గోపాల్ నాయుడికి అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది కీర్తిచక్ర పురస్కారం అందుకున్న నలుగురులో ఆయన ఒకరు.ఈ నలుగురిలో సజీవంగా వున్నది రామ్‌గోపాల్ నాయుడు ఒక్కరే.2012లో భారత ఆర్మీలో చేరిన రామ్ గోపాల్ నాయుడు, 2023 అక్టోబర్ 26న జరిగిన ఓ ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరించారు.
కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద మోహరించిన ఆకస్మిక సైన్య బృందానికి రామ్‌గోపాల్ లీడర్ గా ఉన్నాడు. అక్టోబర్ 26న ఉదయం ఐదుగురు ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడ్డారని రామ్ గోపాల్ కు సమాచారం అందింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన రామ్ గోపాల్ తోటి జవాన్లకు మార్గనిర్దేశం చేస్తూ ఉగ్రవాదులపై విరుచుకుపడ్డాడు.
ఓ ఉగ్రవాది రామ్‌గోపాల్ నేతృత్వంలోని ఆర్మీ బృందంపై గ్రెనేడ్ విసిరాడు. అయినప్పటికీ బయపడకుండా ఉగ్రవాదిని పట్టుకుని హతమార్చాడు. తన పోరాటంలో భాగంగా జవాన్లను కాపాడుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. కీర్తి పురస్కారం దక్కడంపై హర్షం వ్యక్తం చేశాడు.