కోల్కతా ఆర్జీ కార్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ హత్య, అత్యాచారం ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. బుధవారం స్వాతంత్ర్యం వచ్చిన అర్థరాత్రి స్వాతంత్ర్యం కోసం మహిళలు అంటూ పెద్ద ఎత్తున మహిళలు ఆర్జీ కార్ ఆసుపత్రిలోకి చొచ్చుకెళ్లారు. వందలాది మంది మహిళలు ఒక్కసారిగా తోసుకురావడంతో పోలీసులు చేతులెత్తేశారు. మహిళల దాడిలో ఆసుపత్రి ఫర్నిచర్ ధ్వంసమైంది.
ప్రతిపక్షాలు సాక్ష్యాలు చెరిపేందుకే ఇలాంటి దాడికి పాల్పడ్డాయని అధికార టీఎంసీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసును సీబీఐకి అప్పగించారు. ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇది సామూహిత అత్యాచారమనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీనిపై సీబీఐ లోతుగా విచారణ కొనసాగిస్తోంది.
జూనియర్ డాక్టర్ హత్య, అత్యాచారంపై దేశ వ్యాప్తంగా డాక్టర్లు నిరసనకు దిగారు. వైద్య సేవలు నిలిపేశారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. బోధనాసుపత్రుల్లో డాక్టర్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆసుపత్రులను సేఫ్ జోన్లుగా ప్రకటించాలంటూ వైద్య సంఘలు డిమాండ్ చేస్తున్నాయి.