అవినీతి ఆరోపణలపై జైలు శిక్ష అనుభవించిన వ్యక్తిని క్యాబినెట్‌లోకి తీసుకున్న వివాదంలో థాయ్‌లాండ్ ప్రధాని స్రెట్టా థావిసిన్‌ను రాజ్యాంగ ధర్మాసనం పదవి నుంచి తొలగించింది. పిచిత్ చుయెన్‌బాన్‌ను ప్రధాని స్రెట్టా ఇటీవల మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 2008లో ఓ కేసులో పిచిత్ జైలు శిక్ష అనుభవించి తరవాత విడుదల అయ్యారు. జైలు నుంచి విడుదల అయినా అతను తీవ్రమైన అవినీతికి పాల్పడ్డాడని రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది. అలాంటి వ్యక్తిని మంత్రివర్గంలోకి తీసుకునే ముందు అన్నీ పరిశీలించుకోవాల్సిన భాద్యత ప్రధానిపై ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.
ప్రధాని స్రెట్టాను పదవి నుంచి తొలగిస్తూ రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. కొత్త ప్రధానిని పార్లమెంటు ఎన్నుకుంటుందని కోర్టు ప్రకటించింది. ఓ కేసులో న్యాయమూర్తికే లంచం ఇవ్వజూపిన వ్యవహారంలో జైలు శిక్ష అనుభవించిన పిచిత్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడం, చివరకు ప్రధాని స్రెట్టా పదవికే ఎసరు తెచ్చింది.