దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించేందుకు ప్రతి ఒక్కరూ కలసి రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేశారు. ప్రపంచ నైపుణ్యాల కేంద్రంగా భారత్ ఎదగాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఇందుకు ప్రతి ఒక్కరు శ్రమించాలన్నారు.
ప్రపంచానికి అన్నంపెట్టే దేశంగా భారత్ ఎదగాలని, నాడు 40 కోట్ల ప్రజల త్వాగాలతో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, 140 కోట్ల మంది సహకారంతో వికసిత్ భారత్ సాధ్యం చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. భారత్ త్వరలో ఏర్పాటు చేయనున్న అంతరిక్ష కేంద్రం కల సాకారం కావాలని ఆయన ఆకాంక్షించారు.
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అమరవీరులకు ప్రధాని మోదీ ( pm modi speech live) నివాళులు అర్పించారు. ఈ వేడుకలకు 6 వేల మంది దేశ, విదేశాల నుంచి అతిథులు హాజరయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు.