‘‘భారతీయ స్టాక్ మార్కెట్లు నమ్మదగినవి కావు, వాటిలో పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరం’’ అని బహిరంగంగా ప్రకటన చేసిన ప్రబుద్ధుడు రాహుల్ గాంధీ. పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడి హోదాలో బాధ్యతాయుతంగా ఉండవలసిన రాహుల్, అధికార పార్టీపై గుడ్డి వ్యతిరేకతతో దేశ వ్యవస్థల మీద అభాండాలు వేయడం అలవాటుగా మార్చుకున్నారు. భారత ఆర్థిక వ్యవస్థను పతనం చేయాలనే లక్ష్యంతో తప్పుడు ప్రచారాలు చేస్తున్న హిండెన్‌బర్గ్ కమిటీ తాజా వివాదాస్పద వ్యాఖ్యలను ఆధారం చేసుకుని రాహుల్ గాంధీ మన దేశీయ మార్కెట్ల మీద నిస్సిగ్గుగా బురద జల్లారు. విదేశీ సంస్థలకు లాభం చేకూర్చి దేశీయ మార్కెట్లను పడగొట్టే కుట్రలో భాగంగా, భారతీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవద్దంటూ ప్రకటన చేసారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వాచాలతలో భారతీయ పెట్టుబడిదారులను వంచించాలన్న కపటబుద్ధి మాత్రమే బైటపడుతోంది. ఎందుకంటే అదే స్టాక్మార్కెట్లో రాహుల్‌గాంధీ ఇప్పటికే పెద్దమొత్తంలో వ్యక్తిగత పెట్టుబడులు పెట్టి ఉన్నారు. వివాదాస్పద హిండెన్‌బర్గ్ నివేదికను ఆధారం చేసుకుని భారతీయ మార్కెట్ల స్థిరత్వం మీద అనుమానాలు కలగజేసేలా, దేశపు ఆర్థిక ఆరోగ్యం మీద దుష్ప్రచారం చేసేలా మాట్లాడిన రాహుల్ గాంధీ ఆస్తులు స్టాక్ మార్కెట్లలో గణనీయంగా ఉన్నాయి. వాటిమీద గత ఐదు నెలల్లో రాహుల్ గాంధీ ఆర్జించిన లాభాలెంతో తెలుసా? కేవలం రూ.46,49,706 మాత్రమే. మోదీ సర్కారు ఆర్థిక విధానాల ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లు బుల్లిష్ ట్రెండ్‌లో కొనసాగుతున్నందునే రాహుల్‌గాంధీ ఈ లాభాలు ఆర్జించగలిగారు.
2024 లోక్‌సభ ఎన్నికల కోసం దాఖలు చేసిన అఫిడవిట్లో రాహుల్ గాంధీ ప్రకటించిన ఆస్తుల్లో 42శాతం ఆస్తులు ఆయన స్టాక్ మార్కెట్లలో పెట్టిన పెట్టుబడులే, వాటి విలువ రూ.8.3 కోట్లు. అందులో రూ 4.3 కోట్లు షేర్లలోనూ, రూ. 3.8కోట్లు మ్యూచువల్ ఫండ్స్‌లోనూ, రూ 15లక్షలు బంగారం బాండ్స్‌లోనూ ఉన్నాయి. ఇంకో విశేషం ఏంటంటే ఆయన చరాస్తుల విలువ 2019 నుంచి ఇప్పటికి 59శాతం పెరిగింది. అంటే, ఆయన ప్రశ్నలు సంధిస్తున్న మార్కెట్ల పనితీరుకు ఆ విలువ పెరుగుదలే నిదర్శనంగా ఉంది.
రాహుల్ గాంధీ పెట్టుబడులు పెట్టిన కొన్ని షేర్ల వివరాలు చూద్దాం…
యంగ్ ఇండియన్: 1900 షేర్లు, విలువ రూ. 190,000
ఆల్కైల్ అమైన్స్: 373 షేర్లు, విలువ రూ. 739,211
ఆసియన్ పెయింట్స్: 1231 షేర్లు, విలువ రూ. 35,29,954
బజాజ్ ఫైనాన్స్: 551 షేర్లు, విలువ రూ. 35,89,407
దీపక్ నైట్రైట్: 568 షేర్లు, విలువ రూ. 11,92,033
డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్: 516 షేర్లు, విలువ రూ.10,43,429
ఫైన్ ఆర్గానిక్ ఇండస్ట్రీస్: 211 షేర్లు, విలువ రూ.856,301
దివీస్ ల్యాబొరేటరీస్: 567 షేర్లు, విలువ రూ.19,76,222
గర్వారే టెక్నికల్ ఫైబర్స్: 508 షేర్లు, విలువ రూ.16,43,075
జిఎంఎం ఫాడ్లర్: 1121 షేర్లు, విలువ రూ.14,00,073
హిందుస్తాన్ యూనిలీవర్: 1161 షేర్లు, విలువ రూ.27,02,460
ఐసిఐసిఐ బ్యాంక్: 2299 షేర్లు, విలువ రూ.24,83,725
ఇన్ఫో ఎడ్జ్ ఇండియా: 85షేర్లు, విలువ రూ.445,502
ఇన్ఫోసిస్: 870 షేర్లు, విలువ రూ.14,21,580
ఐటిసి: 3093 షేర్లు, విలువ రూ.12,96,276
ఎల్‌టిఐ మైండ్‌ట్రీ: 407 షేర్లు, విలువ రూ.21,14,100
మోల్డ్‌టెక్ ప్యాకేజింగ్: 1953 షేర్లు, విలువ రూ.14,95,510
నెస్లే ఇండియా: 1370 షేర్లు, విలువ రూ.35,67,001
పిడిలైట్ ఇండస్ట్రీస్: 1474 షేర్లు, విలువ రూ. 42,27,432
సుప్రజిత్ ఇంజనీరింగ్: 4068 షేర్లు, విలువ రూ.16,65,439
టిసిఎస్: 234 షేర్లు, విలువ రూ.987,305
టైటాన్ కంపెనీ: 897 షేర్లు, విలువ రూ.32,58,980
ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా: 340 షేర్లు, విలువ రూ.12,10,621
వెర్టోజ్ అడ్వర్టైజింగ్: 260 షేర్లు, విలువ రూ.189,085
వినైల్ కెమికల్స్ ఇండియా: 960 షేర్లు, విలువ రూ.324,240
బ్రిటానియా ఇండస్ట్రీస్: 5.5ఎన్సిడి, రూ.1559
ఎచ్‌డిఎఫ్‌సి ఎంకాప్ డిపి జిఆర్: రూ.19,58,249
ఎచ్‌డిఎఫ్‌సి స్మాల్‌క్యాప్ డిపి జిపిఆర్: రూ. 17,89,032
ఐసిఐసిఐ ఈక్యూ అండ్ డిఎఫ్ డి గ్రోత్: రూ. 19,03,179
పిపిఎఫ్ఎఎస్ ఎఫ్‌సిఎఫ్ డి గ్రోత్: రూ. 19,76,536
ఎచ్‌డిఎఫ్‌సి స్మాల్‌క్యాప్ రెగ్-జి: రూ. 1,23,85,545
ఎచ్‌డిఎఫ్‌సి హైబ్రిడ్ డెట్‌ఫండ్-జి: రూ. 79,01,329
ఎచ్‌డిఎఫ్‌సి స్మాల్‌క్యాప్ డిపి జిపిఆర్: రూ. 17,89,032
ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ రెగ్ సేవింగ్స్-జి: రూ.1,02,19,702
సావరిన్ గోల్డ్ బాండ్స్: 220 యూనిట్లు, విలువ రూ.15,21,740
ఆగస్టు 11న హిండెన్‌బర్గ్ విడుదల చేసిన నివేదికను వెనకేసుకువస్తూ రాహుల్ గాంధీ మాట్లాడడంపై పౌరులు, పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేతగా ఎన్నికైనప్పటి నుంచీ రాహుల్ గాంధీ అధికార బిజెపి ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకుని, అదేపనిగా అయినదానికీ కానిదానికీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నారు. అయితే భారతీయ స్టాక్ మార్కెట్లు రాహుల్ గాంధీ తప్పుడు వ్యాఖ్యల తర్వాత కూడా బలంగానే కొనసాగుతున్నాయి.
మోదీ మూడోసారి ప్రభుత్వంలో దేశీయ స్టాక్ మార్కెట్లు గణనీయమైన అభివృద్ధి నమోదు చేస్తున్నాయి. ఇటీవలి నెలల్లో సెన్సెక్స్, నిఫ్టీ ఎన్నో కొత్త రికార్డులు నెలకొల్పాయి. అయినప్పటికీ మొన్న ఆదివారం నాడు రాహుల్ గాంధీ మళ్ళీ నోరు పారేసుకున్నారు. అమెరికన్ షార్ట్‌సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్, సెబి చైర్పర్సన్ మీద చేసిన ఆరోపణలను విచారించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేసారు.
భారతదేశపు సెక్యూరిటీస్ నియంత్రణ సంస్థ సెబి సమగ్రత తీవ్రంగా దెబ్బతిందంటూ రాహుల్ ఆరోపణలు చేసారు. ‘‘ప్రతిపక్ష నేతగా మీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకురావడం నా బాధ్యత. స్టాక్ మార్కెట్లను పరిపాలించే వ్యవస్థలు దెబ్బతిన్నాయి. అందువల్ల భారతీయ స్టాక్‌మార్కెట్లు పెద్దముప్పులో ఉన్నాయి’’ అని రాహుల్ ప్రకటించారు. అదానీ గ్రూప్ ఆఫ్‌షోర్ ఫండ్స్‌ను వాడుకుంటూ అక్రమంగా షేర్లను సొంతం చేసుకుని, ధరల్లో అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపణలు చేసారు.
అయితే హిండెన్‌బర్గ్ ఆరోపణలను, రాహుల్ గాంధీ ఆందోళనలను ఇన్వెస్టర్లు పెద్దగా పట్టించుకోలేదు. రాహుల్ స్టాక్‌మార్కెట్ల గురించి ఆదివారం వ్యాఖ్యలు చేస్తే, సోమవారం మార్కెట్లలో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు ఫ్లాట్‌గానే ఉండిపోయాయి. అంటే వాటిపై హిండెన్‌బర్గ్ నివేదిక, రాహుల్ వ్యాఖ్యల ప్రభావం ఏమాత్రం లేదన్నమాట.