మహోజ్వల చరిత కల్గిన దేశ సమగ్రతను కాపాడటం ప్రజలందరి కర్తవ్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు వరుసగా మూడో ఏడాది ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నట్లు చంద్రబాబు గుర్తు చేశారు. ‘ఇంటింటా జాతీయ జెండా’ అనే ఈ కార్యక్రమం విస్తృతంగా మారడంపై హర్షం వ్యక్తం చేశారు.
ప్రజలందరికీ సోషల్ మీడియా వేదికగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, తెలుగువారైన పింగళి వెంకయ్య రూపొందించిన మువ్వన్నెల జెండా ప్రతీ ఇంటిపై రెపరెపలాడటం మనకు మరింత ప్రత్యేకం, గర్వకారణమని కొనియాడారు. ప్రతీ ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చారు. జాతీయ జెండాను సోషల్ మీడియా పేజీల్లో ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోవాలని సూచించారు.