జమ్మూ కశ్మీర్ లోని దోడా జిల్లాలో నేటి తెల్లవారుజామున భద్రతా బలగాలు, ఉగ్రవాదులు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆర్మీ కెప్టెన్ వీరమరణం చెందాడు. మరో సాధారణ పౌరుడికి బుల్లెట్ తగిలి గాయపడ్డాడు. దోడా జిల్లాలో ఉగ్రవాదుల కదలికల గురించి మంగళవారం సాయంత్రం అధికారులకు సమాచారం అందింది. శివగఢ్- అసర్ బెల్ట్ లో నలుగురు ఉగ్రవాదులు స్థావరం ఏర్పాటు చేసుకుని నక్కారు.
దీంతో సైనిక బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. భద్రతా బలగాలను పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆర్మీ కెప్టెన్ ఒకరు చనిపోయారు. బుల్లెట్ తగలడంతో ఓ పౌరుడు గాయపడగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.