నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని అలాగే దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. దిల్లీలో నిన్న వర్షం పడగా, ఇవాళ, రేపు కూడా భారీ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రానున్న 24 గంటల్లో దిల్లీ, చండీగఢ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఉత్తరాఖండ్, గుజరాత్ , లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులలో వానలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది.
ఆగస్టు 15న కర్ణాటక, కేరళ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జార్ఖండ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, బిహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జమ్ము, హర్యానా, చత్తీస్ గఢ్, ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కేరళ, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఆగస్టు 18వరకూ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లలో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది.