పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా లో ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ హత్య కేసు సీబీఐ కి అప్పగిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఇప్పటివరకు విచారణ చేపట్టిన రాష్ట్ర పోలీసులు ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలను వెంటనే సీబీఐకి అందజేయాలని ఉత్తర్వుల్లో కోర్టు పేర్కొంది. మూడు వారాల్లో నివేదిక అందజేయాలని సీబీఐని కోర్టును ఆదేశించింది.
కోర్టు పర్యవేక్షణలో కేసును దర్యాప్తు చేయాలని మృతురాలి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా పోలీసుల విచారణలో పురోగతి లేదంటూ హైకోర్టు మండిపడింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు చీఫ్ జస్టిస్ శివజ్ఞానం ఆదేశాలు జారీ చేశారు.
కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌లో ఆగస్టు 9న జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్య, అత్యాచారం ఘటనపై విచారణను ఎన్‌హెచ్‌ఆర్‌సీ సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక అందజేయాలని పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లకు నోటీసులు జారీ చేసింది.