స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో దేశ సరిహద్దుల్లో భద్రతను భారత సైన్యం కట్టుదిట్టం చేసింది. పంజాబ్ సరిహద్దుల్లో ఓ పాకిస్తానీ చొరబాటుదారుడు భారత్లో చొరబడేందుకు ప్రయత్నించగా భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. దీంతో అతడు చనిపోయాడు. సరిహద్దులో ప్రస్తుతం హై అలర్ట్ అమలులో ఉందని బీఎస్ఎఫ్ అధికారి వెల్లడించారు.
తరన్తారన్ జిల్లా పరిధిలోని దాల్ గ్రామం వద్ద అంతర్జాతీయ సరిహద్దు నుంచి భారత్ లోకి ప్రవేశిస్తున్న ఓ వ్యక్తిని భద్రతా బలగాలు గుర్తించాయి. విధుల్లో ఉన్న బీఎస్ఎఫ్ సిబ్బంది చొరబాటుదారుడిని హెచ్చరించారు. వెనక్కి వెళ్ళిపోవాలని కోరినప్పటికీ సరిహద్దు భద్రతా కంచె దాటేందుకు ప్రయత్నించాడు. ఎంత చెప్పిన వినకపోవడంతో భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు