విశాఖ ఆర్కే బీచ్ సమీపంలోని డైనో పార్క్ రిక్రియేషన్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటల క్షణాల్లో వ్యాపించడంతో రిక్రియేషన్ కేంద్రం మొత్తం తగలబడిపోయింది. అగ్నిమాపక యంత్రాలు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. రద్దీ రోడ్డు పక్కనే భారీ మంటలు అలుముకోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు.
ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. మత్య్సదర్శిని హోటల్ పక్కనే ఈ ప్రమాదం జరగడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. మంటలు వేగంగా ఎగసిపడటంతో హోటల్ సిబ్బంది పరుగులు పెట్టారు. రిక్రియేషన్ కేంద్రం మొత్తం తగలబడిపోయే వరకూ మంటలు అదులోకి రాలేదు.