భారతదేశ జనాభా 2036 నాటికి 152.2 కోట్లకు చేరుతుందని కేంద్ర మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ‘విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా- 2023’ నివేదిక పేర్కొంది.
2011 జనాభా లెక్కల ప్రకారం 48.5 శాతంగా ఉన్న మహిళల జనాభా 2036 నాటికి 48.8 శాతానికి చేరనున్నట్లు వివరించింది. 15 ఏళ్ళ వయస్సు కంటే తక్కువ ఉన్న వారి నిష్పత్తి 2036లో తగ్గనుంది. సంతానోత్పత్తి క్షీణతే ఇందుకు కారణమని నివేదిక వివరించింది. మరో వైపు 60 ఏళ్ళు అంతకు పైబడిన వారి జనాభా నిష్పత్తి భారీగా పెరగనుంది.
తాజా నివేదిక ప్రకారం 2011లో 943గా ఉన్న మహిళల నిష్పత్తి 2036లో 952కు చేరనుంది. కౌమార సంతానోత్పత్తి రేటు 2020లో నిరక్షరాస్యుల్లో 33.9 శాతం, అక్షరాస్యుల్లో 11 శాతంగా ఉంది. శిశు మరణాల రేటు క్రమంగా తగ్గుతుంది. 2016 నుంచి 2020 వరకు 20-24 ఏళ్ళ వారిలో సంతానోత్పత్తి శాతం 135.4 శాతం నుంచి 113.6 శాతానికి, 25-29 ఏళ్లున్న వారిలో 166 శాతం నుంచి 139.6 శాతానికి తగ్గినట్లు నివేదిక ద్వారా తెలుస్తోంది.