నిర్వహణ లోపాల కారణంగా తుంగభద్ర డ్యాం 19వ నెంబరు గేటు కొట్టుకుపోయిందని ఏపీ జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తుంగభద్ర ప్రాజెక్టు నిర్వహణకు నిధులు కేటాయించకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందన్నారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ ఇవాళ తుంగభద్ర డ్యాంను పరిశీలించారు. మరో రెండు రోజుల్లో కొట్టుకుపోయిన 19వ నెంబరు గేటు స్థానంలో కొత్తగేటు ఏర్పాటు చేయిస్తామని మంత్రులు తెలిపారు.
తుంగభద్ర డ్యాం 19వ నెంబరు గేటు కొట్టుకుపోవడంతో మూడు రోజులుగా లక్షల క్యూసెక్కుల వరద వృధాగా పోతోంది. గేటు కొట్టుకుపోవడంతో రాయలసీమలో 3 లక్షల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. 60 టీఎంసీల వరద జలాలను వదిలేసి, ఆ తరవాత తాత్కాలిక గేటు ఏర్పాటు చేయనున్నారు. ఇవాళ తుంగభద్ర డ్యాంను కర్ణాటక సీఎం సిద్దరామయ్య పరిశీలించనున్నారు.