లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఏసీబీకి దొరికారు. ఆయనతో పాటు మరో అధికారిని కూడా ఏసీబీ అరెస్ట్ చేసింది.ధరణి వెబ్‌సైట్‌లోని నిషేధిత జాబితా నుంచి 14 గుంటల భూమిని తొలగించాలని జక్కిడి ముత్యంరెడ్డి అనే రైతు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డిని కోరారు.
రూ.8 లక్షలు లంచం ఇవ్వాలని మదన్ మోహన్ కోరగా ముత్యంరెడ్డి ఏసీబీని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఏసీబీ, సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఆయనను విచారించగా జేసీ భూపాల్‌రెడ్డి చెబితేనే డబ్బులు తీసుకున్నామన్నారు. వెంటనే జేసీకి అతనితో ఫోన్ చేయించగా పెద్దఅంబర్‌పేట ఓఆర్ఆర్ వద్దకు నగదు తీసుకురావాలని చెప్పాడు. మదన్‌మోహన్‌తోపాటు అక్కడికి వెళ్లిన ఏసీబీ అధికారులు, అతని నుంచి డబ్బులు తీసుకుని తన కారులో పెట్టుకుంటుండగా జేసీ భూపాల్ రెడ్డిని పట్టుకున్నారు.
ఇద్దరిని అరెస్టు చేసివారి నివాసాల్లో సోదాలు నిర్వహించారు. నాగోల్‌లోని భూపాల్ రెడ్డి ఇంట్లో రూ.16 లక్షల నగదు, కీలకమైన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు