ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో చిరుత హల్చల్ చేసింది. సోమవారం రాత్రి ఆలయ ఏఈవో ఇంటి గోడపై నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. చిరుత ఓ కుక్కును ఎత్తుకెళ్లింది. చిరుతను చూసిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
స్థానికుల సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు చిరుత సంచరించిన ప్రదేశానికి చేరుకున్నారు. చిరుత కదలికలపై ఆరా తీశారు. చిరుత సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు గుర్తించారు. రాత్రి సమయాల్లో జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు స్థానికులను కోరారు.