గ్రీస్ రాజధాని ఏథెన్స్ నగరాన్ని అగ్నికీలలు చుట్టుముట్టాయి. గత వారం చెలరేగిన కార్చిచ్చును అదుపు చేసేందుకు 500 మంది సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నా మంటలు అదుపులోకి రాలేదు. 150 అగ్నిమాపక యంత్రాలను రంగంలోకి దింపారు. తాజాగా కార్చిచ్చు నగరానికి 30 కి.మీ దూరంలోకి సమీపించింది.
కార్చిచ్చు చాలా వేగంగా ఏథెన్స్ నగరంవైపు ప్రవేశిస్తోందని అంతర్జాతీయ మీడియా ద్వారా తెలుస్తోంది. మంటలు 85 అడుగుల మేర ఎగడిపడుతున్నాయి. గాలులకు మంటలు వేగంగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏథెన్స్లోని మారథాన్ ప్రాంతంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.