మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో ఇవాళ తెల్లవారుజాము నుంచి 15 మంది ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. విజయవాడ సమీపంలోని అంబాపురం గ్రామ పరిధిలో వందల కోట్ల విలువైన అగ్రిగోల్డ్ భూములను, రికార్డులు మార్చి అమ్ముకున్న కేసులో ఏసీబీ సోదాలు చేస్తోంది.
అగ్రిగోల్డ్ భూముల కేసు సీబీఐ వద్ద విచారణలో ఉండగానే అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూముల సర్వే నెంబర్లు మార్చి మాజీ మంత్రి జోగి రమేష్ అమ్ముకున్నారనే ఆరోపణలపై ఇప్పటికే కేసు నమోదైన సంగతి తెలిసింది. దీనిపై రెవెన్యూ, ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.