ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ముస్లిం నాయకులు హిందూ మైనర్ బాలికలపై పాల్పడుతున్న ఆగడాలు పెరిగిపోతున్నాయి. అయోధ్య జిల్లాలో ఒక హిందూ మైనర్ బాలికపై ఒక ఎస్పీ ముస్లిం నాయకుడు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన జరిగి కొద్దిరోజులైనా గడవక ముందే, ఇప్పుడు కనౌజ్ జిల్లాలోనూ అలాంటి సంఘటన వెలుగు చూసింది. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ అనుచరుడైన నవాబ్‌సింగ్ యాదవ్ ఒక హిందూ బాలికపై అత్యాచార ప్రయత్నం చేసాడు.
బాధితురాలి కథనం ప్రకారం… కనౌజ్ జిల్లా అడంగ్పూర్ గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. బాధితురాలు ఉద్యోగం కోసం తన బంధువుతో కలిసి ఒక కళాశాలకు వెళ్ళింది. అక్కడ నవాబ్‌సింగ్ యాదవ్ బాలికను వేధించాడు, ఆమెను దుస్తులు విప్పేయమని బలవంతం చేసాడు.
బాలిక ఎంతకీ బైటకు రాకపోవడంతో బైట ఎదురుచూస్తున్న బంధువుకు అనుమానం వచ్చింది. ఆమె పోలీసులకు ఫోన్ చేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గదిలోకి చొరబడ్డారు. అక్కడ బాలికతో అసభ్య భంగిమలో నవాబ్‌సింగ్ పట్టుబడ్డాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు ఆమె బంధువును కొత్వాలీ సదర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు.
నవాబ్‌సింగ్ యాదవ్ మీద పోక్సో చట్టం, ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదయింది. నిందితుణ్ణి అరెస్ట్ చేసారు. బాధితురాలికి వైద్యపరీక్షలు జరిపించారు, ఆమెకు కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు.
నవాబ్‌సింగ్ యాదవ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌కు సన్నిహితుడు, అఖిలేష్ భార్య డింపుల్‌కు అనుచరుడు. అత్యాచార ప్రయత్నం ఆరోపణలను అతను కొట్టిపడేసాడు. తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని ఆరోపించాడు. నవాబ్ అరెస్టుతో అతని అనుచరులైన ఎస్పీ కార్యకర్తలు పోలీస్‌స్టేషన్ దగ్గర చేరి, అతన్ని వెంటనే విడిచిపెట్టాలంటూ నినాదాలు చేసారు.
కొద్దిరోజుల క్రితమే అయోధ్యలో ఎస్పి నేత మొయిద్ఖాన్, అతని బేకరీలో పనివాడు రాజూఖాన్ కలిసి ఒక హిందూ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. ఆ బేకరీని యూపీ ప్రభుత్వం బుల్డోజర్తో కూల్చివేసింది.
ఎస్పీకి చెందిన ముస్లిం నాయకులు హిందూ మైనర్ బాలికలపై అత్యాచారాలకు పాల్పడుతున్న సంఘటనలపై ఆ పార్టీ ఇప్పటివరకూ స్పందించనేలేదు. కానీ ఈ సంఘటనలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమవుతున్నాయి.