తిరుమలలో ద్విచక్రవాహనాల సంచారంపై అటవీశాఖ అధికారులు ఆంక్షలు విధించారు. ఆగష్టు 12 నుంచి సెప్టెంబరు 30 వరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ద్విచక్ర వాహనాలను అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమయంలో అటవీ జంతువుల సంతానోత్పత్తి జరుపుకునే సమయమని అధికారులు వెల్లడించారు.
అడవిలోని జంతువులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు, భక్తులకు కూడా రాత్రి సమయాల్లో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు. భక్తులందరూ సహకరించాలని వారు కోరారు.