ఢిల్లి మద్యం విధాన రూపకల్పనలో జరిగిన అక్రమాల కేసులో అరెస్టై ఐదు నెలలుగా తిహార్ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు మద్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మద్యంతర బెయిల్ మంజూరు చేయలేమని ఇద్దరు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది.
కవిత తరపు న్యాయవాది రోహత్గి వాదనలు వినిపించారు. వెంటనే ప్రతివాదులైన సీబీఐ, ఈడీ వాదనలు వినాలని రోహత్గి కోరారు. ఈ నెల 20న విచారించడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది. 20న జరిగే వాదనలకు హాజరుకావాలని సీబీఐ, ఈడీలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.