రష్యా ఆధీనంలోని ఉక్రెయిన్‌కు చెందిన జపోరిజియా అణువిద్యుత్ కేంద్రంలో ఆదివారంనాడు భారీ మంటలు చెలరేగాయి. ఉక్రెయిన్ దాడి వల్లే మంటలు అంటుకున్నాయని రష్యా చెబుతోంది. రష్యా తప్పిదాల వల్లే అణువిద్యుత్ కేంద్రం ప్రమాదంలో పడిందని ఉక్రెయిన్ వాదిస్తోంది. ఐరోపాలోనే అతిపెద్ద అణవిద్యుత్ కేంద్రాల్లో ఒకటిగా ఉన్న జపోరిజియాను 2022లో రష్యా అధీనంలోకి తీసుకుంది.
జపోరిజియాలో మంటలు అంటుకున్నట్లు అంతర్జాతీయ అణు సంస్థ నిపుణులు వెల్లడించారు. వారు కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. మంటలు అదుపులోకి వచ్చాయని రష్యా ప్రకటించింది. అయితే అణువిద్యుత్ కేంద్రాన్ని రెండు సంవత్సరాల కిందటే మూసివేశారు. ప్రస్తుతం అక్కడ నుంచి ఎలాంటి అణుధార్మికత వెలువడే అవకాశం లేదని రష్యా చెబుతోంది.