బంగ్లాదేశ్‌లో తమపై జరుగుతోన్న దాడులకు నిరసనగా మైనారిటీ హిందువులు భారీ ర్యాలీలు చేశారు. చిట్టగాంగ్, ఢాకాల్లో దాదాపు పది లక్షల మంది ఈ నిరసన ర్యాలీల్లో పాల్గొన్నారు. ఒక్క చిట్టగాంగ్‌లోనే 7 లక్షల మంది నిరసన తెలిపారు. వీరికి స్థానిక ముస్లింలు కూడా మద్దతు పలికారు. వాహనాలు నిలిచిపోయాయి. దేశంలో అసత్య ప్రచారం నిర్వహించే మీడియాను రద్దు చేస్తామని బంగ్లాదేశ్ ప్రభుత్వం హెచ్చరించింది. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హోంశాఖ సలహాదారు సఖావత్ హుస్సేన్ కోరారు.
షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచివెళ్లిన తరవాత, ఆదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు రాజీనామా చేయాలంటూ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒబైదుల్ హసన్ రాజీనామా చేశారు.అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రఫాత్ అహ్మద్‌ను నియమించారు. దీంతో కొంత వరకు అల్లర్లు తగ్గుముఖం పట్టాయని తెలుస్తోంది.
వేలాది మంది బంగ్లాదేశీయులు (Bangladesh Unrest) భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. పశ్చిమబెంగాల్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల వెంట 4096 కి.మీ సరిహద్దు వెంట భద్రత కట్టుదిట్టం చేశారు. సైన్యాన్ని అప్రమత్తం చేశారు. చొరబాటుయత్నాలపై కేంద్రం కమిటీని నియమించింది. ఇప్పటికే చొరబడ్డ 11 మంది బంగ్లాదేశీయులను సైన్యం మేఘాలయ పోలీసులకు అప్పగించింది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు