కాంగ్రెస్ నేతలపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు హిండెన్‌బర్గ్‌కు కాంగ్రెస్ సహకరిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో హిండెన్‌బర్గ్, కాంగ్రెస్ మధ్య ఉన్న భాగస్వామ్యం చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో గందరగోళం సృష్టించడమే కాంగ్రెస్ లక్ష్యంగా ఉందని చురకలు అంటించారు . కాంగ్రెస్ చేసే అసత్య ఆరోపణలకు ఈ ఉదంతమే నిదర్శనం అన్నారు.
అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెరిగాయని హిండెన్‌బర్గ్ ఓ నివేదికను విడుదల చేసింది. సెబీ చైర్పర్సన్ మాధబీ పురీ బోచ్‌కు, ఆమె భర్త ధవళ్ బోచ్‌కు ఈ విషయంతో సంబంధముందని నివేదికలో పేర్కొంది.