బిహార్‌లోని బ్రహ్మయోని పర్వతంపై అనేకరకాల ఔషధ మొక్కలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందులో మధుమేహాన్ని తగ్గించే గుర్మార్ అనే మొక్కను కూడా కనుగొన్నారు. షుగర్ వ్యాధి చికిత్స కోసం బీజీఆర్-34 అనే ఔషధ తయారీకి శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్‌ఐఆర్) పరిశోధకులు దీనిని ఉపయోగిస్తున్నారు. ఈ మొక్కలోని జిమ్నెమిక్ యాసిడ్, పేగులోని పొరపై ఉండే గ్రాహక ప్రదేశాలను నింపేస్తుంది. అందువల్ల తీపి పదార్థాలను తినాలనే ఆకాంక్షను తగ్గించడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయి తగ్గిస్తుంది.
బ్రహ్మయోని పర్వతంపై పిథెసెలోబియం డుల్సే, జిజుఫస్ జుజుబా వంటి ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. స్థానికుల సాయంతో వాటిని సాగు చేయించాలని శాస్త్రవేత్తలు కోరుతున్నారు.