దేవాలయాల్లో దూపదీప నైవేద్యాల కోసం అందజేసే సాయాన్ని రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రూ. 50 వేల కంటే తక్కువ ఆదాయం ఉన్న ఆలయాలకు ఆర్థికసాయం పెంచుతామన్నారు. ఈ నిర్ణయం ద్వారా దేవాదాయశాఖపై రూ. 32 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. త్వరలో పాలకమండళ్లు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. దేవాదాయశాఖపై రూ. 32 కోట్ల అదనపు భారం పడుతుందని వెల్లడించారు.
సీజీఎఫ్ కింద 160 ఆలయాలు పునర్నిర్మిస్తున్మట్లు చెప్పారు. రాష్ట్రంలో 27, 127 ఆలయాల పరిధిలో 4.65 లక్షల ఎకరాల భూమి ఉందన్నారు. ఆలయ భూములు పరిశీలించి ఆక్రమణలు తొలగించడంతో పాటు , కృష్ణా, గోదావరి సంగమం వద్ద జలహారతులు పునరుద్ధరిస్తామని అన్నారు.
తిరుమల నుంచే దేవాదాయ శాఖలో ప్రక్షాళన మొదలైందన్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఏ చిన్న ఆరోపణలు వచ్చినా నివేదికలు తెప్పించుకుంటున్నామని , అధికారుల పనితీరును మెరుగుపరుచుకునేందుకు తగిన మార్గనిర్దేశం చేస్తున్నామన్నారు. నెల్లూరు జిల్లాలో పనితీరు సరిగ్గాలేని ఐదుగురు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.