కర్ణాటక- హోస్పేట్లో ఉన్న తుంగభద్ర డ్యామ్ 19వ గేటు వరదలకు కొట్టుకుపోయింది. దీంతో దాదాపు లక్ష క్యూసెక్కుల మేర నీరు వృథా అవుతోంది. జలాశయానికి వరద తగ్గడంతో శనివారం రాత్రి 11 గంటల సమయంలో గేట్లుదించారు. అయితే 19వ గేటు చైన్ లింక్ తెగిపోయింది. అనంతరం గేటు కొట్టుకుపోయింది.
ప్రాజెక్టు నుంచి 60 టీఎంసీల నీళ్లు బయటికి వదిలిన తర్వాతే గేటు పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు వీలు పడుతుంది. దీంతో ప్రస్తుతం 33 గేట్లు తెరిచి నీటిని కిందికి వదులుతున్నారు. డ్యామ్ భద్రతకు సంబంధించి ఇలాంటి ఘటన జరగడం 70 ఏళ్ళలో ఇదే తొలిసారి.
తుంగభద్ర నుంచి సుంకేశులకు లక్ష క్యూసెక్కుల వరద చేరుతోంది. దీంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీబీ బోర్డు అధికారులు హెచ్చరించారు. కర్నూలు జిల్లా కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు