Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home అంతర్జాతీయం

‘ముస్లిములుగా మారిపోండి లేదా చచ్చిపోండి’

బంగ్లాదేశీ హిందువులకు ముస్లిం మతగురువు హెచ్చరిక

Phaneendra by Phaneendra
Aug 10, 2024, 06:02 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అమెరికాలో నివసిస్తున్న ఇస్లామిక్ మతగురువు అబూ నాజమ్ ఫెర్నాండో బిన్ అల్ ఇస్కందర్, బంగ్లాదేశ్‌లో హిందువులపై మారణకాండతో సంబరాలు చేసుకున్నాడు. బంగ్లాదేశ్‌లోని ముస్లిములు హిందువులపై దాడులు కొనసాగించాలని, దేవాలయాలను నేలమట్టం చేసేయాలనీ పిలుపునిచ్చాడు. అంతేకాదు, బంగ్లాదేశ్‌లోని ముస్లిములు హనాఫీలు కాబట్టి అక్కడి హిందువులు తమను అదృష్టవంతులుగా భావించుకోవాలని సూచించాడు. అక్కడున్నది మలికీ, షఫీ, హన్‌బలీ వంటి సున్నీ తెగలైతే మరింత క్రూరంగా, హింసాత్మకంగా వ్యవహరించేవారని వివరించాడు.

అబూనాజమ్ వాగుడు, బంగ్లాదేశ్‌లో హిందువులను పూర్తిగా నిర్మూలించాలన్న రాడికల్ ఇస్లామిస్టుల మనోగతాన్ని ప్రతిఫలిస్తోంది. అబూనాజమ్ ఇస్లామిక్ స్టడీస్‌లో పరిశోధక విద్యార్ధి, రెండు దశాబ్దాలుగా ఇస్లామిక్ సైన్సెస్‌ను అధ్యయనం చేస్తూ బోధిస్తున్నాడు. అతని ప్రధానమైన అజెండా ముస్లిమేతరులకు, ప్రత్యేకించి హిందువులకు వ్యతిరేకంగా విద్వేషాన్ని వ్యాపింపజేయడమే. హిందువులను అతను ఎప్పుడూ కాఫిర్లు అనే వ్యవహరిస్తాడు. ప్రపంచమంతా ముస్లిములే ఉండాలి, అవిశ్వాసులను అణచివేయాలి, వారిని హింసించి లోబరచుకోవాలి, వారి ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేయాలి… అన్నది అబూనాజమ్ సిద్ధాంతం.  

బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా రాజీనామా చేయగానే మతకల్లోలాలు చెలరేగాయి, హిందువులపై అత్యాచారాలు దారుణంగా జరుగుతున్నాయి. దాంతో తన ఆనందాన్ని అబూనాజమ్ సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షంగానే పంచుకున్నాడు. బంగ్లాదేశ్‌లో హిందువులను నిర్మూలించాలంటూ సోషల్ మీడియా ‘ఎక్స్’లో వరుస ట్వీట్లతో విద్వేషాగ్ని రగిల్చాడు.

అల్-అస్-సున్నా పద్ధతిలోని నాలుగు ప్రధాన సున్నీ మార్గాల్లో మూడింటిని రిఫర్ చేస్తూ అబూనాజమ్ బంగ్లాదేశ్‌లో హింసాకాండ మరింత జరగాలంటూ రెచ్చగొట్టే ట్వీట్లతో చెలరేగిపోయాడు.

‘‘సున్నీ వర్గానికి చెందిన మలీకీ, షఫీ, హన్‌బలీ మార్గాలు ముస్లిమేతరులకు, ప్రత్యేకించి హిందువులకు రెండే అవకాశాలు ఇస్తున్నాయి… ఇస్లాంలోకి మారడం, లేదా మరణించడం. ఆ నిజం నాకెంతో ఊరటనిస్తోంది’’ అన్నాడు.

‘‘(బంగ్లాదేశీ) హిందువులు హనాఫీలతో కలిసి ఉన్నందుకు కృతజ్ఞులై ఉండాలి. అదే మలికీలు, షఫీలు, హన్‌బలీలు అయి ఉంటే వారి పరిస్థితి ఎలా ఉండేదో’’ అంటూ సున్నీలలోని మిగతా తెగలు ముస్లిమేతరులతో మరింత దారుణంగా వ్యవహరిస్తారని, దాన్ని హిందువులు తట్టుకోలేరనీ వ్యాఖ్యానించాడు. ఇస్లాంలో సాపేక్షంగా మిగతా తెగలతో పోలిస్తే హనాఫీలు తక్కువ హింసాత్మకంగా ఉంటారని దాని భావం.

అబూ నాజమ్ తన అతివాద భావాలను మరింత ప్రకటిస్తూ, హన్‌బలీ మార్గాన్ని ప్రస్తావించాడు. సౌదీ అరేబియా, కతార్ వంటి దేశాల్లోని సున్నీ తెగకు చెందినవారు అనుసరించే ఆ పద్ధతిలో ముస్లిమేతరులను అవమానించే పద్ధతిని అనుసరించాలని చెప్పాడు. ముస్లిమేతరులను గుర్తించడానికి వారి తలలు గొరిగేయాలని, వారిని ముస్లిముల కంటె హీనులుగా వ్యవహరించాలనీ చెప్పే హన్‌బలీ న్యాయసూత్రాలను అనుసరించి హిందువులను హింసించాలన్నది అబూ నాజమ్ భావన.   

ఒకవైపు హిందువులను దారుణంగా హింసించాలని పిలుపునిస్తూనే, ముస్లిం మెజారిటీ దేశాల్లో తమను అధములుగా ఒప్పుకునే హిందువుల పట్ల కొంత ఉదారంగా వ్యవహరించవచ్చునని అబూ నాజమ్ చెప్పుకొచ్చాడు. తమ ధర్మాన్ని వదిలిపెట్టేసి, ఇస్లామిక్ నియమాల ప్రకారం బతకడానికి సిద్ధంగా ఉన్న హిందువులతో సమస్య లేదంటున్నాడు. మొత్తంమీద బంగ్లాదేశ్‌లో హిందువులను పూర్తిగా తుడిచిపెట్టేయాలని, ఆ దేశంలో హిందూ అన్న జాడే లేకుండా చేయాలనీ పిలుపునిచ్చాడు. అంతేకాదు, బంగ్లాదేశ్‌లో హిందువుల మీద హింస జరుగుతోందన్న వాదన అబద్ధమనీ, అదంతా హిందువులు చేస్తున్న ప్రచారం మాత్రమేననీ అబూనాజమ్ వ్యాఖ్యానించాడు.

అబూనాజమ్ కేవలం రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సరిపెట్టుకోవడంలేదు. హిందువులపై తన విద్వేషాన్ని బహిరంగంగానే ప్రకటిస్తున్నాడు. ప్రముఖ బంగ్లాదేశీ గాయకుడు రాహుల్ ఆనంద ఇంటిని దోచుకుని, తగలబెట్టేసిన ఘటనపై అతను అల్లాకు ధన్యవాదాలు ప్రకటించాడు. అలా, బహిరంగంగానే హిందువులను చంపేయమంటూ పిలుపునిస్తున్నాడు. అమెరికాలో నివసిస్తూ బంగ్లాదేశ్‌లో హిందువులను నిర్మూలించాలంటున్న ఆ ముస్లిం పరిశోధకుడి ప్రవర్తన, ఆ మతస్తుల నిజ నైజాన్ని పట్టిస్తోంది.

Tags: Abu Nazmandhra today newsBangladeshHindu AnnihilationHindu GenocideIslamic Scholar in USSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం
general

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ
general

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు
general

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ
general

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్
general

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

Latest News

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.