బిహార్ పోలీసులు అరుదైన, కోట్లాది విలువైన పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. 50 గ్రాముల బరువైన కాలిఫోర్నియంను బిహార్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.850 కోట్లు ఉంటుందని గోపాల్గంజ్ జిల్లా ఎస్పీ స్వార్న్ ప్రభాత్ మీడియాకు తెలిపారు. నేపాల్ సరిహద్దుల నుంచి నలుగురు సభ్యుల ముఠా కాలిఫోర్నియం తరలిస్తోందనే నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కాలిఫోర్నియం బయటపడింది. నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
ఏమిటీ కాలిఫోర్నియం? ఎందుకింత ధర ?
కాలిఫోర్నియం చాలా అరుదైన పదార్థం. దీన్ని బంగారం, వెండి నిల్వలను గుర్తించడంలో ఉపయోగిస్తారు.విమానాల పరికరాల అరుగుదలను కూడా కాలిఫోర్నియంతో గుర్తించవచ్చు. మెటల్ డిటెక్టర్ల తయారీలోనూ దీన్ని వినియోగిస్తారు. భూమిలో ముడిచమురు నిల్వలను గుర్తించడంలోనూ కాలిఫోర్నియం ఉపయోగపడుతుంది.