ప్రకృతి విధ్వంసం జరిగిన వాయనాడ్‌లోని ముండక్కై, చురాల్‌మల్ ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే చేశారు. ముందుగా ఢిల్లీ నుంచి కన్నూర్ చేరుకున్న ప్రధాని మోదీ, అక్కడ నుంచి ముఖ్యమంత్రి విజయన్, కేంద్ర మంత్రి సురేశ్ గోపి గవర్నర్ మహమ్మద్ ఖాన్‌తో కలసి వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం కాల్పెట్టలో హెలికాప్టర్ దిగిన ప్రధాని మోదీ విధ్వంసం జరిగిన ప్రాంతాలను కాలినడకన పరిశీలించారు. బాధితులను ప్రధాని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. బాధితులను రక్షించిన తీరును ఎన్డీఆర్ఎఫ్ అధికారులు ప్రధానికి వివరించారు. సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న బాధితులను ప్రధాని పరామర్శించారు. అనంతరం ప్రధాని మోదీ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
జులై 29, 30న సంభవించిన పెను విపత్తులో 226 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు.అతి భారీ వర్షాలకు మట్టితో కూడిన కొండలు జారి గ్రామాలపై పడటంతో నాలుగు గ్రామాలు నామారూపాల్లేకుండా పోయాయి. వందలాది గృహాలు ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే.