ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 12 ప్రాజెక్టులకు పాత పేర్లను పునరుద్దరించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక మార్చిన పేర్లను తీసివేసి, గతంలో ఉన్న పేర్లు కొనసాగుతాయని జీవో విడుదల చేసింది. వైఎస్‌ఆర్ పల్నాడు కరవు నివారణ పథకం పేరును గోదావరి పెన్నా అనుసంధాన ప్రాజెక్టుగా పాత పేరును పునరుద్దరించారు.
వైఎస్‌ఆర్ వేదాద్రి ఎత్తిపోతల పథకం పేరును ముక్త్యాల ఎత్తిపోతల పథకంగా పేరు మార్చారు. మరొకొన్ని ప్రాజెక్టుల పేర్లను కూడా మార్పు చేశారు. నేటి నుంచి పాతపేర్లు వాడుకలోని రానున్నాయి.