సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. వీరిభారినపడి చదువుకున్న వారే ఎక్కువగా డబ్బు పోగోట్టుకుంటున్నారు. తాజాగా జనగామకు చెందిన కండక్టర్ పోలోజు రామేశ్వర్‌కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి వాట్సాప్ లింకు వచ్చింది. బ్యాంకు నుంచి వచ్చిన తరహాలో సైబర్ నేరగాళ్లు లింకు పంపించారు. రామేశ్వర్ బ్యాంకు నుంచి వచ్చిందని భావించి దానిపై క్లిక్ చేశాడు. ఆ తరవాత అతని బ్యాంకు ఖాతా నుంచి మొదటి దఫా రూ.7 లక్షలు, తరవాత రూ.4 లక్షలు దుండగులు కాజేశారు. అతని ఫోనుకు ఖాతా నుంచి డబ్బు డెబిట్ అయినట్లు మెసేజ్ రావడంతో బ్యాంకుకు పరుగులు తీశాడు. దుండగులు పంపిన లింకు నుంచి డబ్బు డ్రా చేసినట్లు బ్యాంకు సిబ్బంది గుర్తించారు.
జనగామ టౌన్ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో విచారణ ప్రారంభించారు. ప్రజలను ఎన్ని విధాలుగా అప్రమత్తం చేస్తున్నా సైబర్ నేరగాళ్లు కొత్తదారులు వెతుకుతున్నారు. ఫోనుకు వచ్చే లింకులను పొరపాటున కూడా క్లిక్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.