ద్విచక్ర వాహన మార్కెట్‌లో పొరుగుదేశం చైనాను భారత్ దాటేసింది. ఈ రంగంలో రోజురోజుకు భారత్ లో వృద్ధి నమోదు అవుతోంది. ఇప్పటి వరకు మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న చైనాను భారత్ అధిగమించింది. ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కొనుగోలు కూడా పెరిగింది.
ఈ ఏడాది ఫోర్ వీలర్ ఈవీ మార్కెట్ కంటే ద్విచక్ర వాహనాల ఈవీ మార్కెట్ 1.5 రెట్లు పెరుగుతుందని మార్కెట్ నిపుణుల అంచనా. 2024 తొలి త్రైమాసికంలో టూవీలర్ ఈవీల విక్రయం 25 శాతం పెరుగుతుందని భావిస్తున్నారు.
భారత్ లో టాప్-10 ఈవీ టూ వీలర్ బ్రాండ్‌లలో ఓలా, టీవీఎస్ మోటార్, ఎథర్ ఎనర్జీ ఉన్నాయి. టీవీఎస్, హీరో, బజాజ్ వంటి దిగ్గజ సంస్థలకు ఓలా, ఎథర్ కంపెనీలు సవాలు విసురుతున్నాయి.
2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా టూ వీలర్ ఈవీ సేల్స్ వాటా 44 శాతానికి చేరనుంది. అంతేకాదు, 2024-30 మధ్య ఈవీ టూ వీలర్ విక్రయాలు 150 మిలియన్ యూనిట్లకు చేరుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.