రఘురామకృష్ణరాజు కస్డోడియల్ టార్చర్ కేసులో సీఐడి మాజీ అదనపు ఎస్పీ విజయపాల్ ముందస్తు బెయిల్‌ను హైకోర్టు నిరాకరించింది. 2021 మేలో అప్పటి నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసి కస్టడీలో చిత్రహింసలు పెట్టారని నమోదైన కేసులో విజయపాల్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ చేసినట్లు సుప్రీంకోర్టు కూడా అంగీకరించిందని ప్రముఖ న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. విజయపాల్‌కు బెయిల్ ఇవ్వొద్దని లూథ్రా వాదనలు వినిపించారు. విజయపాల్ తరపున జీవీఎస్ కిషోర్ కుమార్ వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ముందస్తు బెయిల్‌ను నిరాకరించారు.
రఘురామకృష్ణరాజు జూన్ నెలలో గుంటూరు ఎస్పీకి తనపై కస్టోడియల్ టార్చర్ జరిగినట్లు ఫిర్యాదు చేశారు. దీనిపై గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి, అప్పటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్, నిఘా విభాగం అధిపతి సీతారామాంజనేయులు, సీఐడి అదనపు ఎస్పీ విజయపాల్‌పై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తెలిసిందే.